

ఆశ్రమ ఉత్తరాధికారి శ్రీ శ్రీనాథ్ రావు తరఫున ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిమళ గారు హాజరై, ముందుగా శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజ్ ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, “జీవితంలో సరైన మార్గదర్శకత్వం కోసం ప్రతి ఒక్కరూ గురువు బాటలో నడవాలి. గురువులు మనకు విజ్ఞానాన్ని, నైతికతను మరియు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతారు. శ్రీశ్రీశ్రీ దశరథ మహారాజ్ వారి మార్గదర్శకత్వం మన భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది” అని పేర్కొన్నారు.

