నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్,:- ఆనారోగ్యంతో మృతి చెందిన అల్లపొల్ల రుక్మిణి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న “మీ కోసం మేము” సేవా సంస్థ వారి అంత్యక్రియల కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందించింది. నవీనరాజ్ (నవీపేట్) తన తరఫున రూ.4,000 అందించి కుటుంబానికి అండగా నిలిచారు. సంస్థ సభ్యులు బీమార్తి మోహన్, సుంకరి మహిపాల్, నవీనరాజ్, బండారి రాజశేఖర్తో పాటు కాలనీ వాసులు ఈ సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టకాలంలో తోడుగా నిలిచిన సేవా సంస్థను గ్రామస్థులు అభినందించారు.