బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు రూ.50 వేల విలువైన ఇంజెక్షన్ ఉచితం

కె24న్యూస్ తెలుగు జూన్ 22. తిరుపతి రుయా హాస్పిటల్ లో  బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతోంది. సాధారణంగా లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సలో భాగంగా, రూ.50 వేల విలువైన ఇంజెక్షన్‌ను హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా అందిస్తోంది. చేయి, కాలు బలహీనపడటం, మాట పడిపోవడం, ముఖం వంకరపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ ను సంప్రదించాలి. సకాలంలో చికిత్స అందించడం ద్వారా 90 శాతం ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. న్యూరాలజీ ఓపీ సేవలు మంగళ, శుక్రవారాల్లో అందుబాటులో ఉండగా, అత్యవసర వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :