
తెలుగు K24 న్యూస్ | జూన్ 30
అయ్యప్ప సొసైటీలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు మంగళవారం (జూన్ 30) నుంచి జూలై 3వ తేదీ (శుక్రవారం) వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఈ మహోత్సవాలు శ్రీశ్రీశ్రీశ్రీశ్రీశ్రీ మన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి మంగళాశాసనాలతో, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
నాలుగు రోజుల పాటు ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం, యాగాలు, ప్రత్యేక హోమాలు, వేదపారాయణాలు, నిత్యారాధనలు, విశేష పూజలు పలు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన నూతన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జూలై 3వ తేదీ (శుక్రవారం) ఉదయం 7:12 గంటలకు, సమాన నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ శుభముహూర్తంలో వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవారు, శ్రీ అభయాంజనేయస్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.
ఈ దివ్య మహోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
గోవిందా… గోవిందా…! శ్రీ వేంకటేశ్వర వారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ… ఈ పవిత్ర మహోత్సవాల్లో కుటుంబ సమేతంగా పాల్గొనండి.

