
తెలుగు కే న్యూస్ బెజ్జంకి మండలం పాపయ్యపల్లె, వడ్లూరు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ హాజరై ఇళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారమవుతుందని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లబ్ధిదారులు తమ సొంతింటి కలను నెరవేర్చిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

