జైపూర్‌లో నూతన కమ్యూనిటీ భవనానికి భూమిపూజ

మంచిర్యాల, జూన్ 22 (తెలుగు కే న్యూస్): జైపూర్ మండల కేంద్రంలో రూ.25 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ భవనానికి రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సామాజిక, సాంస్కృతిక అవసరాల కోసం కమ్యూనిటీ భవనాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :