
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి పట్టణ కేంద్రంలోని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో కలిసి లంబాడ హక్కుల పోరాట సమితి (LHPS) కమిటీ ఆధ్వర్యంలో బంజారా సమస్యల పైన చర్చించారు.. ఈ కార్యక్రమం లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ జిల్లా అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్ , ఎస్ ఎస్ నగర్ మండల అధ్యక్షులు మాలోత్ పీర్ సింగ్ నాయక్ , ఎల్లారెడ్డి డివిజన్ ఇంచార్జి బానోత్ మదన్ లాల్, కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మోహన్ నాయక్ , నీలం మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

