తప్పుడు వివరాలతో SIR సర్వే.. ప్రజల ఆందోళన

కామారెడ్డి జిల్లా : తెలుగు K24 న్యూస్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 37వ వార్డులో చేపడుతున్న SIR సర్వేలో బీఎల్‌వోలు ఇంటి నంబర్లు, కుటుంబ వివరాలు తప్పుగా నమోదు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. 5-6-455 ఇంటి నంబర్‌ను 5-6-454గా నమోదు చేయడంతో పాటు, ఆ ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉండగా నాలుగు ఫారాలు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇలాంటి పొరపాట్లతో ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు, వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్ స్పందించి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ప్రజలు కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.