నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌ను కలిసిన జై గౌడ్ నాయకులు

కామారెడ్డి జిల్లా, తెలుగు K24 న్యూస్:
జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ముకుంద రెడ్డిని జై గౌడ్ ఉద్యమం జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ముకుంద రెడ్డి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని, గౌడ సంఘాల సూచనలను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ సుందర్ సింగ్, జై గౌడ్ ఉద్యమం నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :