ప్రయాణికులను కాపాడిన డ్రైవర్ కు సన్మానం

 

తెలుగు కేన్యూస్ (జూన్ 1) గన్నేరువరం మండల రిపోర్టర్*

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండి కాలనీలో ప్రధాన రహదారిపై ఇటీవల కరీంనగర్ టు డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులో షార్ట్ సర్క్యూట్ తో తో మంటలు చెలరేగాయి. అప్రతమైన బస్సు డ్రైవర్ బోయిని ప్రశాంత్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందికి దింపాడు. మంటలు చెలరేయి బస్సు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని పలువురు ప్రయాణికులు వాపోయారు. బస్సు డ్రైవర్ బోయిని ప్రశాంత్ ను బుధవారం రోజున గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో ఫ్రెండ్స్ ఆటో యూనియన్ డ్రైవర్స్ ఓనర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ వాహనాలు డ్రైవింగ్ చేసేటప్పుడు దృష్టి డ్రైవింగ్ పై పెట్టి ప్రయాణికులను గమ్య స్థలానికి చేర్చే బాధ్యత ప్రతి ఒక్క డ్రైవర్ పై ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.