ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

K 24 న్యూస్ తెలుగు కొండమల్లేపల్లి మండలంలోని గాజీనగర్, చిన్న ఆడిశర్లపల్లి, పెండ్లిపాకల ప్రభుత్వ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం తాత్కాలిక ప్రాతిపదికన ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈవో రమావత్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు గల అభ్యర్థులు జూన్ 23 నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు మండల విద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :