మృతుల కుటుంబాలకు పరామర్శ.. నివాళులర్పించిన బీజేపీ నాయకులు

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం, k24 న్యూస్ తెలుగు జూలై 7: బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇంచార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు (వెంకన్న) జఫర్‌ఘడ్ మండలంలోని లింబ్య నాయక్ తండాలో మాజీ సర్పంచ్ దీప్ల నాయక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ చాడ రాజేందర్ రెడ్డి తండ్రి, తిమ్మంపేట సర్పంచ్ చాడ కవిత రెడ్డి మామ చాడ గోపాల్ రెడ్డి మృతిపై కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ఉప్పుగల్లు గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు లెంకల రాజు తండ్రి మృతిపై కూడా సంతాపం తెలియజేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.