సన్న వడ్లు సాగు చేయాలి.. సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

K24 న్యూస్ తెలుగు రాజన్న సిరిసిల్ల జిల్లా  వీర్నపల్లి రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ Garima Agrawal ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు సన్న వడ్ల విత్తనాలు పంపిణీ చేశారు.
రైతులు పంట మార్పిడిలో భాగంగా సన్న వడ్లు సాగు చేయాలని, సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం వినియోగం పెరుగుతున్నందున రైతులు సన్న రకాల వరి సాగుపై దృష్టి పెట్టాలని తెలిపారు.
లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి రసీదులు భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే ఆయిల్ పామ్ సాగు, సహజ వ్యవసాయం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :