సింగరేణి జీఎం వై. రఘురామిరెడ్డికి ఘన సన్మానం

తెలుగు కే న్యూస్ సింగరేణిలో 38 సంవత్సరాల పాటు  వివిధ హోదాల్లో సేవలందించి, జనరల్ మేనేజర్ (అండర్‌గ్రౌండ్ మైన్స్)గా విధులు నిర్వహించి ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న శ్రీ వై. రఘురామిరెడ్డిని ఎస్టిపిపి అధికారులు ఘనంగా సన్మానించారు. ఎస్టిపిపి పరిపాలనా భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఈడీ సిహెచ్. చిరంజీవి మాట్లాడుతూ రఘురామిరెడ్డి అందించిన సేవలను కొనియాడి, వారి శేష జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. సింగరేణిలో SAP ఆన్‌లైన్ కంప్యూటరీకరణ అమలులో ఆయన విశేష కృషి చేశారని అధికారులు పేర్కొన్నారు. అనంతరం శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో జీఎం మదన్ మోహన్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :