
బెజ్జంకి, జూన్ 22 (కే24 న్యూస్): అన్నపూర్ణ ప్రాజెక్టు పరిధిలోని D-7 కాల్వ నుంచి రైతుల పొలాలకు నీరందించే పిల్లకాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరువు పరిస్థితులు మరియు భూగర్భ జలాల క్షీణత నేపథ్యంలో రైతులకు పిల్లకాల్వలు అత్యవసరమని పేర్కొన్నారు.
అదేవిధంగా, బెజ్జంకి–బేగంపేట, పోతారం–శనిగరం వంటి పెండింగ్ ఆర్&బీ రోడ్లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అర్హులకే అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.


