ట్రాక్టర్ డ్రైవర్లకు ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహణ పోలీస్ శాఖ*

నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, జూన్ 30, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
*పోలీస్ కమిషనర్  సాయి చైతన్య ఐపీఎస్ ఆదేశాల మేరకు*, ఇటీవల ట్రాక్టర్లకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, డిచ్‌పల్లి సీఐ కె. వినోద్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున జక్రాన్‌పల్లి పోలీసులు జక్రాన్‌పల్లి మండలానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్లకు ప్రత్యేక రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ *కె. వినోద్*, ఎస్‌ఐ *జి. మహేష్ , ట్రాక్టర్ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా *తప్పు దిశలో (Wrong Direction) వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాక్టర్లు మరియు ట్రాలీలపై ప్రయాణికులను ఎక్కించవద్దని, అతివేగంగా వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని* సూచించారు.
అలాగే రాత్రి వేళల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు స్పష్టంగా కనిపించేలా వాటిపై *రేడియం రిఫ్లెక్టివ్ స్టిక్కర్లను* అతికించారు. ప్రతి ట్రాక్టర్‌కు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ తదితర అన్ని సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టానికి దారితీస్తుందని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :