ఈ సందర్భంగా ఏఎస్ఐ గఫార్ మాట్లాడుతూ.. గుర్తు తెలియని ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఉద్యోగాలు, పెట్టుబడుల పేరుతో వచ్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, సీవీవీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకుండా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ముందు పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపారు.
అలాగే మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజల అప్రమత్తతే సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రధాన ఆయుధమని పోలీసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.