వింజపల్లిలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం

0–5 ఏళ్ల చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సర్పంచ్ శ్రీజ–జీవన్ రెడ్డి

 

K24 న్యూస్ తెలుగు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ–జీవన్ రెడ్డి, ఏఎన్‌ఎం టి. సంగీత చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సర్పంచ్ తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గుర్రం రాజు రెడ్డి, ఉపసర్పంచ్ రంగనవేని వెంకటస్వామి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బద్దం రాజిరెడ్డి, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.