

కె24న్యూస్ తెలుగు జూన్ 22. తిరుపతి రుయా హాస్పిటల్ లో బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతోంది. సాధారణంగా లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ చికిత్సలో భాగంగా, రూ.50 వేల విలువైన ఇంజెక్షన్‌ను హాస్పిటల్ యాజమాన్యం ఉచితంగా అందిస్తోంది. చేయి, కాలు బలహీనపడటం, మాట పడిపోవడం, ముఖం వంకరపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్ ను సంప్రదించాలి. సకాలంలో చికిత్స అందించడం ద్వారా 90 శాతం ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. న్యూరాలజీ ఓపీ సేవలు మంగళ, శుక్రవారాల్లో అందుబాటులో ఉండగా, అత్యవసర వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.


