
మంచిర్యాల జిల్లా, జూన్ 23 (తెలుగు కే న్యూస్): జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోరారు.
కొంతమంది వ్యక్తులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సింగరేణి యాజమాన్యం వెంటనే విచారణ జరిపి, నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీలో పూర్తి పారదర్శకత పాటిస్తూ అర్హులకే అవకాశాలు కల్పించాలని, ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


