శ్రీరంగరాజపురంలో భక్తిశ్రద్ధలతో గంగమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 21. గంగాధరనెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం తయ్యురు పాయకట్టు ఇలవేల్పు శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం పాయకట్టు గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో హాైజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ప్రతిమను వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు పసుపు కుంకుమ, రవిక, పూలు, పండ్లు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చైర్మన్ జలంధర్ నాయుడు, బోర్డు సభ్యులు అమృత చందు, పైనేని ధనుంజయ నాయుడు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :