తెలంగాణ రక్షణ సేనలో బీజేపీ నేత చేరిక

హైదరాబాద్, తెలుగు కే న్యూస్ బంజారాహిల్స్: సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బీజేపీ నాయకుడు నెమలికొండ వేణుమాధవ్ తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. బుధవారం బంజారాహిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు యువత ముందుకు రావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణవాదులంతా తెలంగాణ రక్షణ సేన ద్వారా ఏకమవుతారని వేణుమాధవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :