చిరంజీవి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ :-పోతంగల్, ఆగస్టు 22: పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పోతంగల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ సౌధ మల్లయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. చిరంజీవి సేవా కార్యక్రమాల స్ఫూర్తితో సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు కల్లు బాబు, రాజమల్లు, బుచ్చేశ్వర్, రాజేందర్, రాజు, జుర్రు సతీష్, యాదగిరి, సునీల్, భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :