
నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, ఆగస్టు 22,
తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
జక్రాన్ పల్లి మండలం లోని బాలనగర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు నిజామాబాద్ కు చెందిన శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ వారు పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేశారు, ఈ కార్యక్రమంలో అధ్యక్షులు టి. శ్రీనివాసచారి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఆర్థికంగా వెనుక ఉండొచ్చేమో గాని చదువు విషయంలో వెనుకబడరాదని చదువుతోనే ఇంటి స్థితిగతులు మారుతాయని , తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు కోశాధికారి రామ్మోహన్, శేఖర్, రాము, బాలనగర్ వార్డు సభ్యులు బోదాసు శ్రీను, పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉమాదేవి, రేవతి, నర్సయ్య, పాల్గొన్నారు.


