

నవీపేట్ బస్టాండ్‌లో వృద్ధ మహిళ మెడలోని గుండ్ల తాడును కత్తిరించిన కేసు దర్యాప్తులో ముఠా గుట్టురట్టైంది. నిజామాబాద్, నందిపేట ప్రాంతాల్లోనూ ఇదే తరహా చోరీలకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును ఛేదించిన నవీపేట్ ఎస్‌ఐ కే. శ్రీకాంత్ నేతృత్వంలోని పోలీసు బృందాన్ని ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.

