మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం లేదు: మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫిర్యాదు

కరీంనగర్: తెలుగు కే న్యూస్ నగరపాలక సంస్థలో గత మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడంపై మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు జిల్లా కలెక్టర్, CDMA అధికారులకు ఫిర్యాదు చేశారు.మున్సిపల్ నిబంధనల ప్రకారం కనీసం నెలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలపై చర్చించాల్సి ఉందని తెలిపారు. మూడు నెలలుగా సమావేశాలు నిర్వహించకపోవడం ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధమని పేర్కొన్నారు.నిబంధనల ఉల్లంఘనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రవీందర్ సింగ్ ప్రభుత్వాన్ని కోరారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :