

నల్లగొండ జిల్లాకు చెందిన ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి మృతికి సంతాపంగా టీజీవీపీ ఆధ్వర్యంలో ఎస్సీ బాలుర వసతి గృహంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. కెవిన్ ఆధ్వర్యంలో రూపారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అనంతరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా కెవిన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులను తప్పిదాలపై మందలిస్తే వాటిని సరిదిద్దుకునే విధంగా స్వీకరించాలన్నారు. అంతేకానీ ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం, దాడులకు పాల్పడటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. గురువులను దేవుళ్లలా భావించి గౌరవించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో కనిపించే హింసాత్మక పాత్రలను ఆదర్శంగా తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. ఫ్యాక్షన్ సినిమాలు, హింసను ప్రోత్సహించే కంటెంట్‌కు దూరంగా ఉండి, మంచి విలువలను పెంపొందించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నితిన్, రాజేష్, సుజిత్, సిద్దు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


