ప్రశ్నించిన ఎమ్మార్పీఎస్ నేత కుటుంబంపై దాడిని ఖండించిన దళిత సంఘాలు

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 22. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండి కుప్పం గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీలో గ్రామకంఠం స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా కర్పూరం చెట్లు నరికివేయడం, దీనిని ప్రశ్నించిన ఎమ్మార్పీఎస్ నాయకుడు ఎం.రవీంద్ర మాదిగ మరియు ఆయన కుటుంబ సభ్యులపై దాడికి ప్రయత్నించడాన్ని ఎమ్మార్పీఎస్, భారతీయ అంబేద్కర్ సేన, దళిత ఉద్యమ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై తహసీల్దార్ తనుజ, ఎస్సై నరేష్ లకు వినతిపత్రం అందజేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామకంఠం భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు తక్షణమే సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని నాయకులు కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే నియోజకవర్గ స్థాయిలో ఆందోళన చేపడతామని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, ఎమ్మార్పీఎస్ కుప్పం నియోజకవర్గ కో-ఇన్‌చార్జ్ వెంకటేష్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షులు జయప్ప మాదిగ, ఎమ్మార్పీఎస్ రామకుప్పం మండల అధ్యక్షులు విజయ్ కుమార్, కుప్పం మండల అధ్యక్షులు రాజేష్, బాబు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత కే.పాపన్న మాదిగ, భారతీయ అంబేద్కర్ సేన నియోజకవర్గ సీనియర్ నాయకులు బాలచంద్రబాబు, బహుజన సేన కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మహేష్ తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :