జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లవు: సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

కె24న్యూస్ తెలుగు జూన్ 30.  జర్నలిస్టుల రక్షణలో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. రాజకీయ నాయకులు, అవినీతిపరుల బాగోతాలను బయటపెట్టే నిజాయితీ గల పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. శాటిలైట్, యూట్యూబ్, ప్రింట్ మీడియా జర్నలిస్టులపై నమోదైన కేసులు నిజమైనవా లేక కక్షపూరితమైనవా అని నిర్ణయించే అధికారం ఇకపై జర్నలిస్ట్ సంఘాలకే ఉంటుంది. 7 రోజుల్లోగా వారు నివేదిక ఇవ్వాలి. అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకులపై, అందుకు సహకరించే పోలీసులపై కఠిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇది జర్నలిజం రంగానికి కొండంత అండ.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :