కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశంలో చోటుచేసుకున్న ఘటనపై బీజేపీ మండల శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. వార్డు సభ్యురాలు సమావేశానికి హాజరు కాకుండా ఆమె స్థానంలో మరో మహిళ పాల్గొనడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అధికారులకు ఫిర్యాదు చేసింది

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండల్ :-మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశం జూన్ 30న నిర్వహించగా, 15వ వార్డు సభ్యురాలు సాహిదా బేగం సమావేశానికి హాజరు కాకుండా ఆమె బంధువైన మరో మహిళ సమావేశానికి వచ్చినట్లు బీజేపీ మండల నాయకులు ఆరోపించారు.
ప్రజలచే ఎన్నికైన వార్డు సభ్యురాలు స్వయంగా సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా, ఆమె స్థానంలో వేరొకరు పాల్గొనడం గ్రామపంచాయతీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి, సంబంధిత మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వార్డు సభ్యురాలు సాహిదా బేగంపై కూడా చట్టప్రకారం సభ్యత్వం రద్దు చేసే దిశగా చర్యలు చేపట్టాలని బీజేపీ మండల శాఖ అధికారులను కోరింది.
ఈ కార్యక్రమంలో మైసరాద రాజేందర్ గౌడ్, నీరడి భూషణ్, సుంకరి రాజు, శ్రీనివాస్ గౌడ్, గణేష్, బండారి రాజశేఖర్, బునాది నవీన్, ప్రేమ్ సింగ్, గంగోని రాము, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :