బీఎస్పీని గ్రామ స్థాయి వరకు బలోపేతం చేయాలి: బొడపట్ల ఈశ్వర్

సిద్దిపేట, తెలుగు కే న్యూస్ జూన్ 24: బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చీఫ్ జోన్ ఇంచార్జి బొడపట్ల ఈశ్వర్ పిలుపునిచ్చారు. సిద్దిపేట అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాన్షీరాం ఆశయాలు, మాయావతి చేపట్టిన సామాజిక మార్పు కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసి బూత్, సెక్టార్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తెలంగాణ మాస పత్రికల పంపిణీపై ఆరోపణలు కరీంనగర్: జిల్లా తెలుగు కే న్యూస్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో తెలంగాణ మాస పత్రిక ప్రతులను ఆరు నెలలుగా మూలకు పడేశారని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి గూడ కనుకయ్య ఆరోపించారు. ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పత్రికను తీసుకొచ్చినా, మండల కార్యాలయాలకు సకాలంలో పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయంపై కలెక్టర్, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆగస్టు 3న పత్రికలను పంపిణీ చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తాజా వార్తలు చదవండి :