మద్దేపల్లి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం: సర్పంచ్ మనోజ్ కుమార్ ప్రారంభం

నిజామాబాద్ జిల్లా,K24NEWSTHELUGU నవీపేట్ మండల్ :- మద్దేపల్లి గ్రామం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మద్దేపల్లి గ్రామంలో ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మనోజ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఆశ వర్కర్ లత ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది గ్రామంలో ఇంటింటికీ తిరిగి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గ్రామంలో ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా 100% లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నామని లత తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :