
హైదరాబాద్, తెలుగు కే న్యూస్ బంజారాహిల్స్: సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన బీజేపీ నాయకుడు నెమలికొండ వేణుమాధవ్ తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. బుధవారం బంజారాహిల్స్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు యువత ముందుకు రావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణవాదులంతా తెలంగాణ రక్షణ సేన ద్వారా ఏకమవుతారని వేణుమాధవ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.




