
హైదరాబాద్, తెలుగు కే న్యూస్ దిల్‌సుఖ్‌నగర్: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత నిరుద్యోగులతో కలిసి దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో ధర్నాలో పాల్గొన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు కేవలం 5 వేల పోస్టులు కాకుండా 20 వేల వరకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కానిస్టేబుల్ పోస్టులు, ఏజ్ రిలాక్సేషన్ అంశాల్లో ప్రభుత్వం మాట తప్పిందన్నారు. కానిస్టేబుళ్లకు 36 ఏళ్లు, ఎస్సైలకు 38 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.




