
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, జూన్ 29, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణం పరిధిలోని నిజాంసాగర్ ప్రధాన కాలువ కాలువలో పూడికతో నిండిపోయి ఉంది, చాలా సంవత్సరాల నుండి కాలువ పూడికను తీయకపోవడం వల్ల రైతులు పొలాలకు వెళ్లే నీరు సరిగ్గా సరిపడా కాకపోవడంతో ప్రభుత్వం స్పందించి కూరుకుపోతున్న కాలువ పూడిక పనులు మరమ్మత్తులను చేపట్టింది, ఈ పూడిక పనులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డి ఈ కృష్ణమూర్తి, మరియు ఏఈ పవన్ రాజ్ ఆధ్వర్యంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ పూడిక పనులు జెసిబి సహాయంతో ప్రారంభించారు,కూడిక పనులు పర్యవేక్షణలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఇరిగేషన్ ఇన్స్పెక్టర్ సంతోష్, రాజు, గంగవ్వ, పనులు పర్యవేక్షిస్తూ అక్కడే ఉన్నారు.




