
చేర్యాల, జూన్ 26 (తెలుగు K24 న్యూస్): చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామానికి చెందిన చిగుళ్ల వంశీ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వ్యక్తిగత పనులపై చేర్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా మెజిస్ట్రేట్ కోర్టు ఎదురుగా ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అపూర్వ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి తల్లి, భార్య ఉండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




