రైతులు యూరియా కోసం రాస్తారోకో ధర్నా.

యాప్‌లో వివరాలు లేక 5 వేల ఎకరాల రైతులకు ఇబ్బందులు.

నిజామాబాద్ జిల్లా ,ఆర్మూర్ మండలం, ఆగస్టు 22: తెలుగు కే న్యూస్ ప్రతినిధి, యూరియా యాప్‌లో ఆర్మూర్ పట్టణ రైతుల వివరాలు కనిపించక సుమారు 5 వేల ఎకరాల రైతులు యూరియా పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్‌తో సంబంధం లేకుండా ఎకరాకు మూడు బస్తాల యూరియా, రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిజాంసాగర్ కెనాల్ బ్రిడ్జిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు,
ఇప్పటికే సబ్‌కలెక్టర్, తహసీల్దార్, వ్యవసాయ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో ఎరువులు అందించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు,
రైతుల రాస్తారోకోతో ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ధర్నాలో ఆరుగురు రైతు ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :