
హైదరాబాద్, కూకట్పల్లి (K24 NEWS):
ఇటీవల మరణించిన తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావు కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత శనివారం కూకట్పల్లిలోని వారి నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా పద్మారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కవిత, ఆయన తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు.
తెలంగాణ ఉద్యమంలో గొట్టిముక్కల పద్మారావు చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన సేవలను తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.




