27/10/2026, Tuesday · 05:43:06 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

నిరవధిక సమ్మె చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు బీఎస్పీ సంఘీభావం

Katta Ravinder 27/10/2026 3:33 PM సిద్దిపేట 12

నిరవధిక సమ్మె చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు బీఎస్పీ సంఘీభావం
Want this news as a newspaper clip?Print News Clip
  • ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి: జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్

సిద్దిపేట, తెలుగు కే న్యూస్ అక్టోబర్ 27: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 15 రోజులుగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య పథకం ఉద్యోగులకు బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది. మంగళవారం సమ్మె శిబిరాన్ని సందర్శించిన పార్టీ నాయకులు ఉద్యోగులకు తమ మద్దతును ప్రకటించారు.జిల్లాలోని 78 విభాగాలకు చెందిన సుమారు 500 మంది ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న నేపథ్యంలో బీఎస్పీ నాయకులు వారి ఆందోళనకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో జాతీయ ఆరోగ్య పథకం ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో నిరంతరం సేవలందిస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. పదిహేను రోజులుగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం లభించకపోవడం విచారకరమని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి బహుజన సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ల నరేష్, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గ బాధ్యుడు కేతుజు వినోద్ చారి, నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్ము చంద్రం, సిద్దిపేట నియోజకవర్గ బాధ్యుడు కిరణ్, గజ్వేల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, తూప్రాన్ మండల అధ్యక్షుడు నరేష్, నవీన్ తదితరులు పాల్గొని సమ్మె చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

Department employeesBSPsolidarityMedicalHealthindefinitestrike

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

49 Posts

Latest News