27/10/2026, Tuesday · 05:41:17 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి ఇందిరమ్మ ఇళ్ల వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్

srikanth 26/10/2026 4:19 PM కామారెడ్డి 11

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇళ్ల వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్
Want this news as a newspaper clip?Print News Clip

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 26 :k24 న్యూస్ తెలుగు :   కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 79 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్. వై. గిరి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్, జిల్లా రెవెన్యూ అధికారి పాండు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మార్కౌట్, విజిబి–జీ రామ్ జీ పనులను త్వరగా పూర్తి చేయాలి

ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అన్ని మండలాల మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మార్కౌట్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే విజిబి–జీ రామ్ జీ పథకం కింద చేపట్టిన పనులను ప్రతి చోటా 20 నుంచి 30 మంది కూలీలతో నిర్వహించి, పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించకుండా, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇళ్ల వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్

Indiramma HousesPublicGrievancesredressedexpeditiouslyexpeditedDistrictCollector

About the author

srikanth

srikanth

Bureau Incharge

bureau incharge

4 Posts

Latest News