27/10/2026, Tuesday · 05:43:01 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

దుబాయ్‌లో కౌండిన్య సేన ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Katta Ravinder 26/10/2026 3:25 PM అంతర్జాతీయం 22

దుబాయ్‌లో కౌండిన్య సేన ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Want this news as a newspaper clip?Print News Clip
  • విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా వేడుకలు

దుబాయ్: తెలుగు కే న్యూస్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలను దుబాయ్‌లో కౌండిన్య సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ వేడుకల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 300 మందికి పైగా గౌడ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు, యువత, చిన్నారులు కలిసి బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో పండుగ వేడుకల్లో సందడి చేశారు. విదేశీ గడ్డపై తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించడం పట్ల నిర్వాహకులు, పాల్గొన్న సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

విదేశాల్లో పెరుగుతున్న చిన్నారులకు తమ మాతృభాష తెలుగు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను పరిచయం చేయడం ఎంతో ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు. అందరూ ఒకచోట చేరి సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రవాస తెలంగాణ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడంతో పాటు, భావితరాలకు మన సంస్కృతిని అందించేందుకు దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నేలపట్ల నరసయ్య, రాచకొండ శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ రాజు, సమ్మెట సంతోష్, గాదర్ల సత్యం, గూడవేణి గవాస్కర్, శ్రీధర్ ఆర్య, ధర్మేందర్, అబ్బగాని సంతోష్, నరేష్, ప్రియాంక, మౌనిక, సారిక, ప్రణీతతో పాటు పలువురు గౌడ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

Bathukamma celebratesaegisKaundianSenaDubai

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

49 Posts

Latest News