27/10/2026, Tuesday · 05:41:13 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి

BHOOM REDDY CH 26/10/2026 8:52 PM జాతీయం 9

శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
Want this news as a newspaper clip?Print News Clip

తిరుమ‌ల‌: భారత ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ సోమ‌వారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. భారత ఉపరాష్ట్రపతికి టీటీడీ ఈవో, అద‌న‌పు ఈవో స్వామివారి చిత్ర పటాన్ని, తీర్థప్రసాదాలను అందించారు. . ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్య ప్రసాద్, టీటీడీ బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు రాష్ట్ర,జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

visits SrivariVicePresidentIndia

About the author

BHOOM REDDY CH

BHOOM REDDY CH

Chief Editor

7 Posts

Latest News