27/10/2026, Tuesday · 05:40:01 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్‌పై అటాక్‌ : అమెరికా ద‌ళాలు

BHOOM REDDY CH 26/10/2026 8:32 PM అంతర్జాతీయం 5

ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్‌పై అటాక్‌ : అమెరికా ద‌ళాలు
Want this news as a newspaper clip?Print News Clip
  • ఎన‌ర్జీ, న్యూక్లియ‌ర్ కేంద్రాల‌పై దాడుల‌కు అమెరికా ప్లాన్

అమెరికా: ట్రంప్ ఆదేశిస్తే 96 గంట‌ల్లోనే ఇరాన్‌పై దాడి చేసేందుకు ప‌శ్చిమాసియాలో త‌మ ద‌ళాలు సిద్ధంగా ఉన్న‌ట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఎన‌ర్జీ, న్యూక్లియ‌ర్ కేంద్రాల‌పై దాడుల‌కు అమెరికా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగే ఆ దాడుల‌కు ఇజ్రాయెల్ కూడా స‌హ‌క‌రించ‌నున్న‌ది ఇరానీ రేడార్లు, మిస్సైల్ లాంచ‌ర్లు మాత్ర‌మే కాకుండా ఇత‌ర మౌళిక‌స‌దుపాయాల‌ను టార్గెట్ చేసేందుకు అమెరికా సంసిద్ద‌మైన‌ట్లు తెలుస్తోంది. దాడులు ఎప్పుడు చేయాల‌న్న నిర్ణ‌యం ట్రంప్ చేతుల్లో ఉంద‌ని, ఆయ‌న ఆదేశాలను అనుస‌రించి చ‌ర్య‌లు ఉంటాయ‌ని అమెరికా అధికారులు చెప్పారు.అయితే ఈ ఏడాది చివ‌రి లోగా ఎప్పుడైనా ఆ ఆదేశం రావొచ్చు అని అన్నారు. దాదాపు మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత  ఆదేశాలు అందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. భావిస్తున్న‌ట్లు యూఎస్ సెంట్ర‌ల్ క‌మాడ్ చెప్పింది.మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల త‌ర్వాత చేప‌ట్ట‌బోయే వ్యూహాల గురించి ఇంకా ట్రంప్ ఆలోచ‌న చేయ‌లేద‌ని మీడియా సంస్థ‌తో ఆ అధికారులు వెల్ల‌డించారు. వైట్‌హౌజ్ మాత్రం ఈ నివేదిక‌పై స్పందించ‌లేదు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

AttackIranTrumporderstroops

About the author

BHOOM REDDY CH

BHOOM REDDY CH

Chief Editor

7 Posts

Latest News