27/10/2026, Tuesday · 06:31:46 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

యాదమరి మండలంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ కలెక్టర్

Katta Ravinder 23/10/2026 7:24 AM జిల్లా వార్తలు 70

యాదమరి మండలంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ కలెక్టర్
Want this news as a newspaper clip?Print News Clip
  • చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం

  యాదమరి మండలం అక్టోబర్ 22 తెలుగు కే న్యూస్

 యాదమరి రెండవ రోజు నామినేషన్లు 11 నామినేషన్లు మొత్తం 19 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు

యాదమరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలు ప్రక్రియను జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణలో భాగంగా రెండో రోజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి మరియు సహాయ కలెక్టర్ బర్ణ వెంకటేష్‌లు కలసి నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న రిటర్నింగ్ అధికారి లక్ష్మీనారాయణ, తహసీల్దారు పార్థసారథి, ఎంపీడీవో పెంచల వీరేంద్ర మరియు ఇతర సిబ్బందిని అడిగి నామినేషన్ ప్రక్రియ వివరాలను, ఎదురవుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో, సబ్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య మరియు 60 మంది రక్షక భట సిబ్బంది (పోలీసులు) తో నామినేషన్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

యాదమరి మండలంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ కలెక్టర్

nomination centreCollectorinspectsYadamariMandal

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

50 Posts

Latest News