ఎంపీటీసీ , జడ్పీటీసీ పోలింగ్ తేదీ మార్పుపై నేడు నిర్ణయం?

- ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చే అంశం
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి (రాజేష్ కుమార్)అక్టోబర్ 28.ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ తేదీని మార్చే అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పోలింగ్ జరగాల్సి ఉండగా, అదే రోజున అర్బన్ బాడీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో, పోలింగ్ను నవంబర్ 5కి వాయిదా వేసే యోచనలో ఉంది. అలాగే, ఓట్ల లెక్కింపును నవంబర్ 5 నుంచి 7వ తేదీకి మార్చే అవకాశం ఉందని సమాచారం. దీనితో పాటు 'అర్నబ్' తుఫాన్ ప్రభావం ఎన్నికలపై ఎంతవరకు ఉంటుందనే అంశంపై కూడా అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?












