28/10/2026, Wednesday · 02:33:23 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

సంగమేశ్వరం పునరావాస శిబిరం పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

BHOOM REDDY CH 28/10/2026 1:14 PM రాష్ట్ర వార్తలు 1

సంగమేశ్వరం పునరావాస శిబిరం పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
Want this news as a newspaper clip?Print News Clip
  • తుఫాన్ బాధితులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

నాగాయలంక మండలం సంగమేశ్వరంలోని ఆర్ణబ్ తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాన్ని బుధవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి, వారికి అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. తుఫాన్ తీరం దాటినా, ప్రభావిత వర్షాల ముప్పు తప్పే వరకూ అధికారుల సూచనలకు అనుగుణంగా బాధితులు శిబిరాల్లోనే ఉండాలని సూచించారు. శిబిరాల్లో బాధితులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. శిబిరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిబ్బందికి సూచించారు. బాధితుల కోసం సిద్దమైన మధ్యాహ్న భోజనం వారికి వడ్డించారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

Rehabilitation CampMLACouncilBuddhaprasadinspectsSangameshwaram

About the author

BHOOM REDDY CH

BHOOM REDDY CH

Chief Editor

9 Posts

Latest News

సేవా రత్న జాతీయ పురస్కారానికి వింజపల్లి సర్పంచ్ దంపతులు ఎంపిక తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి ఎంపీటీసీ , జడ్పీటీసీ పోలింగ్ తేదీ మార్పుపై నేడు నిర్ణయం? కామారెడ్డి జిల్లాలో విషాదం ఏడుపాయల వాగులో దూకి ముగ్గురు మృతి సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలి ఎమ్మెల్యే కెవిఆర్ సమాజ సేవలో విశేష కృషికి కె.పి. నటరాజ్‌కు డాక్టరేట్ బొమ్మకల్ రామాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు బెజ్జంకిలో గంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు పిల్లలు పుట్టడం లేదంటూ భార్యను హతమార్చిన భర్త తుపాను పరిస్థితులపై కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్