28/10/2026, Wednesday · 01:51:22 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

సమాజ సేవలో విశేష కృషికి కె.పి. నటరాజ్‌కు డాక్టరేట్

Katta Ravinder 28/10/2026 9:33 AM రాష్ట్ర వార్తలు 46

సమాజ సేవలో విశేష కృషికి కె.పి. నటరాజ్‌కు డాక్టరేట్
Want this news as a newspaper clip?Print News Clip
  • సమాజ సేవకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌.. హర్షం వ్యక్తం చేసిన నటరాజ్

హైదరాబాద్: తెలుగు కే న్యూస్ చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచి, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హైదరాబాద్‌కు చెందిన కె.పి. నటరాజ్‌కు గౌరవ డాక్టరేట్‌ లభించింది. విద్యార్థి దశలోనే ప్రతిభతో ముందంజలో నిలిచిన ఆయన, అనంతరం ప్రజాసేవను తన లక్ష్యంగా ఎంచుకొని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.సమాజ సేవ పట్ల ఆయన చూపిన అంకితభావం, చేసిన కృషిని గుర్తించి ఇంటర్నేషనల్ తమిళ్ కల్చరల్ యూనివర్సిటీ, కొట్రవై న్యూస్ మంత్లీ మ్యాగజైన్‌ ద్వారా డాక్టరేట్‌ గౌరవం లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుర్తింపు తనకు మరింత బాధ్యతను పెంచిందని నటరాజ్‌ పేర్కొన్నారు.ఈ సందర్భంగా కె.పి. నటరాజ్‌ మాట్లాడుతూ.. “సమాజ సేవకు నేను అందించిన సేవలు, చేసిన కృషికి గుర్తింపుగా డాక్టరేట్‌ అందుకోవడం ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ఇంటర్నేషనల్ తమిళ్ కల్చరల్ యూనివర్సిటీ, కొట్రవై న్యూస్ మంత్లీ మ్యాగజైన్‌ ద్వారా ఈ గౌరవం లభించడం పట్ల హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పురస్కారం సమాజం పట్ల నా బాధ్యతను మరింత పెంచింది. భవిష్యత్తులోనూ మరింత అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తూ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాను” అని తెలిపారు.సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న కె.పి. నటరాజ్‌కు డాక్టరేట్‌ లభించడం ఆయన సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

సమాజ సేవలో విశేష కృషికి కె.పి. నటరాజ్‌కు డాక్టరేట్

service DoctorateoutstandingcontributioncommunityNataraj

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

51 Posts

Latest News

తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి సంగమేశ్వరం పునరావాస శిబిరం పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎంపీటీసీ , జడ్పీటీసీ పోలింగ్ తేదీ మార్పుపై నేడు నిర్ణయం? కామారెడ్డి జిల్లాలో విషాదం ఏడుపాయల వాగులో దూకి ముగ్గురు మృతి సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలి ఎమ్మెల్యే కెవిఆర్ బొమ్మకల్ రామాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు బెజ్జంకిలో గంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు పిల్లలు పుట్టడం లేదంటూ భార్యను హతమార్చిన భర్త తుపాను పరిస్థితులపై కలెక్టర్లతో హోంమంత్రి అనిత టెలికాన్ఫరెన్స్ నిరవధిక సమ్మె చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు బీఎస్పీ సంఘీభావం