28/10/2026, Wednesday · 03:56:46 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

గోత్రాల కులానికి చిందం సిద్ధిరాములు చేసిన సేవలు మరువలేనివి

Katta Ravinder 28/10/2026 3:13 PM కామారెడ్డి 61

గోత్రాల కులానికి చిందం సిద్ధిరాములు చేసిన సేవలు మరువలేనివి
Want this news as a newspaper clip?Print News Clip
  • తెలంగాణ రాష్ట్ర గోత్రాల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తిపిరిశెట్టి శ్రీనివాస్

తెలుగు కే న్యూస్  గొట్టిముకుల: గోత్రాల కుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు చిందం సిద్ధిరాములు కుల అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ రాష్ట్ర గోత్రాల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తిపిరిశెట్టి శ్రీనివాస్ అన్నారు.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టిముకుల గ్రామానికి చెందిన చిందం సిద్ధిరాములు ఈ నెల 23న అకాల మరణం చెందడంతో బుధవారం ఆయన స్వగ్రామంలోని నివాసంలో సంతాపసభ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తిపిరిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి కుల సంఘం ప్రతినిధులు హాజరై సిద్ధిరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జులు చిందం శ్రీనివాస్, ఎల్‌ఐసీ ఆంజనేయులు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తిపిరిశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ల వేణు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శంకరయ్య, రాష్ట్ర కోశాధికారి తాళ్ల స్వామి, వివిధ జిల్లాల అధ్యక్షులు మాట్లాడుతూ.. చిందం సిద్ధిరాములు గోత్రాల కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పదేళ్లపాటు సేవలందించారని గుర్తుచేశారు. కులానికి ప్రభుత్వ గుర్తింపు సాధించేందుకు ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కులంలోని చిన్నా, పెద్దా నాయకులను, మేధావులను, రాజకీయ ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ అన్ని జిల్లాల్లో సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేశారని తెలిపారు.సిద్ధిరాములు చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా 2009 ఫిబ్రవరి 19న గోత్రాల కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీసీ ‘ఏ’ జాబితాలో చేర్చిన సందర్భం కుల చరిత్రలో గుర్తుండిపోతుందని నాయకులు పేర్కొన్నారు. కులానికి గుర్తింపు లభించినప్పుడు ఆయన వ్యక్తం చేసిన ఆనందం, సమాజ అభివృద్ధి కోసం చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు. ఆయన మృతి గోత్రాల కుల సంఘానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం సిద్ధిరాములు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సిద్ధిరాములు భార్య చిందం భాగ్యమ్మ, కుమారులు చిందం రమేష్, చిందం భైరయ్యతో పాటు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శంకరయ్య, ప్రధాన కార్యదర్శి తాళ్ల వేణు, కోశాధికారి తాళ్ల స్వామి, మెదక్ జిల్లా అధ్యక్షులు బండారి నగేష్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తిపిరిశెట్టి రవీందర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తిపిరిశెట్టి రాజు, కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జులు చిందం శ్రీనివాస్, అంజయ్య, ప్రవీణ్, శంకర్, రాములు, రాజయ్య, రంజిత్, రాజమొగిలి, స్వామి తదితర కుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?

గోత్రాల కులానికి చిందం సిద్ధిరాములు చేసిన సేవలు మరువలేనివి

services renderedSiddhiramcastetribesunforgettable

About the author

Katta Ravinder

Katta Ravinder

Chairman

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

54 Posts

Latest News

కోహెడను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి సేవా రత్న జాతీయ పురస్కారానికి వింజపల్లి సర్పంచ్ దంపతులు ఎంపిక తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి సంగమేశ్వరం పునరావాస శిబిరం పరిశీలించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎంపీటీసీ , జడ్పీటీసీ పోలింగ్ తేదీ మార్పుపై నేడు నిర్ణయం? కామారెడ్డి జిల్లాలో విషాదం ఏడుపాయల వాగులో దూకి ముగ్గురు మృతి సాధ్యమైత తొందరగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నీ నూతన భవనంలోని మార్చాలి ఎమ్మెల్యే కెవిఆర్ సమాజ సేవలో విశేష కృషికి కె.పి. నటరాజ్‌కు డాక్టరేట్ బొమ్మకల్ రామాలయం వద్ద బోర్ మోటార్ ఏర్పాటు బెజ్జంకిలో గంజాయి సేవించిన వ్యక్తిపై కేసు నమోదు