కోహెడను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలి

- రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది: బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం
కోహెడ: తెలుగు కే న్యూస్ కరువు పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవాలని, కోహెడ మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కోహెడ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ నేతృత్వంలో కోహెడ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కరువు పరిస్థితులతో నష్టపోతున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. కోహెడ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే కరువు మండలంగా ప్రకటించి, అర్హులైన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలంపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపుతున్నారని వేంకటేశం ప్రశ్నించారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని నిలదీశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కోరారు.కోహెడ మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం, ఇతర సహాయక చర్యలు అందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల పక్షాన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ సర్పంచులు మ్యాకాల స్వర్ణలత–సురేందర్ రెడ్డి, పకీడే సంపత్, కాతాం ఆమూల్య–రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మ్యాకాల రజినీకాంత్ రెడ్డి, పిల్లి నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మం సతీష్, ఉపాధ్యక్షుడు సామల గిరిధర్, కార్యదర్శి దానవేని రాజయ్య, కోశాధికారి బండ సుమన్ యాదవ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంది సత్యనారాయణ రెడ్డి, వివిధ మోర్చాల మండల అధ్యక్షులు నాగు అజయ్, అన్నాడి లక్ష్మారెడ్డి, బండ జగన్ యాదవ్, పొన్నాల శంకర్, బాణోత్ సురేష్ నాయక్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?













