28/10/2026, Wednesday · 08:49:51 PM About UsPrivacy PolicyContact Us
K24 News Telugu

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు

srikanth 28/10/2026 7:40 PM కామారెడ్డి 3

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు
Want this news as a newspaper clip?Print News Clip
  • ప్రభుత్వ వైద్య కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
  • సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలి

కామారెడ్డి జిల్లా అక్టోబర్ 28:k24 న్యూస్ తెలుగు :   జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసోత్సవం – అక్టోబర్ 2026లో భాగంగా బుధవారం కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా పోలీస్ శాఖ, జిల్లా సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (D4C) ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

‘PAUSE FOR SAFETY – Pause. Think. Verify.’ (ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి) అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ డీఎస్పీ  మధుసూధన్, కామారెడ్డి రూరల్ సీఐ  శ్రీధర్, సైబర్ క్రైమ్ ఎస్ఐ  నరేశ్, దేవునిపల్లి ఎస్ఐ  రంజిత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కామారెడ్డి డీఎస్పీ  మధుసూధన్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, నకిలీ ఉద్యోగాల పేరుతో మోసాలు, రుణ యాప్‌ల ద్వారా వేధింపులు, ఇతరుల పేరుతో నటిస్తూ చేసే మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా జరిగే మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించే డీప్‌ఫేక్ వీడియోలు, నకిలీ ఆడియోల ద్వారా జరిగే సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ గారు సూచించారు. ఇలాంటి వీడియోలు, ఆడియోలను నమ్మే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని, గుర్తుతెలియని వ్యక్తులకు డబ్బులు పంపవద్దని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను తెరవకూడదని, ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఎవరికీ వెల్లడించకూడదని తెలిపారు. తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే సందేశాలను నమ్మవద్దని, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాల నివారణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ద్వారా వివిధ రకాల సైబర్ నేరాలు, నేరగాళ్లు అనుసరించే విధానాలు, మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సైబర్ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ప్రదర్శించి, వాటి ద్వారా విద్యార్థులకు మరింత స్పష్టంగా వివరించారు. సైబర్ భద్రతా నియమాలను పాటిస్తూ ఆన్‌లైన్‌లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

సైబర్ మోసానికి గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. సత్వరంగా ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన డబ్బును నిలిపివేసే అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు.

అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాల నివారణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. 

 ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొనగా, సుమారు 300 మంది విద్యార్థులు సైబర్ నేరాల నివారణపై అవగాహన పొందారు.

ఇదీ చదవండి :: గోత్రాల కులానికి చిందం సిద్ధిరాములు చేసిన సేవలు మరువలేనివి

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు

bank detailsvigilantcyberfraudsdisclosepersonalanyone

About the author

srikanth

srikanth

Bureau Incharge

bureau incharge

7 Posts

Latest News